HomeCURECMCనైతిక నాయకత్వమే నిజమైన విజయం

నైతిక నాయకత్వమే నిజమైన విజయం

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

_ ఏఐ, డేటా ఆధారిత నిర్ణయాలే నేటి మేనేజ్‌మెంట్‌కు కీలకమన్న ముఖ్య అతిథి డా. వెంకట్రామ్ వసంతవాడ..

నేటి ఆధునిక కార్పొరేట్ యుగంలో కృత్రిమ మేధస్సు (AI), డేటా విశ్లేషణ, సమస్యల పరిష్కారం మరియు నిరంతర అభ్యాసం అత్యంత అవసరమని సీడ్‌వర్క్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీ & సీఈఓ డా. వెంకట్రామ్ వసంతవాడ పేర్కొన్నారు.

_ బ్లూ సఫైర్ జూబ్లీ (65 వసంతాలు) వేళ విద్యా ప్రయాణం మరింత గర్వకారణం: సంస్థ అధ్యక్షురాలు ఆరతి సంపతి..

_ ఘనంగా శివ శివాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ 31వ స్నాతకోత్సవం..

_ 2024-26 బ్యాచ్‌కు చెందిన 249 మంది విద్యార్థులకు మేనేజ్‌మెంట్ పట్టాల ప్రదానం..

_ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, నగదు పురస్కారాల అందజేత..

లోకల్ వైబ్స్, కొంపల్లి: ప్రతిష్టాత్మక విద్యాసంస్థ శివ శివాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (SSIM) ప్రాంగణం సంబరాల వేదికైంది. 2024-26 బ్యాచ్‌కు చెందిన 249 మంది విద్యార్థులు తమ విద్యా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని, నూతన వృత్తిపరమైన బాధ్యతల్లోకి అడుగుపెడుతూ డిగ్రీ పట్టాలు అందుకున్నారు. శనివారం అట్టహాసంగా జరిగిన ఈ 31వ స్నాతకోత్సవంలో పలువురు కార్పొరేట్ దిగ్గజాలు, సంస్థ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.సాంకేతికతకు తోడుగా నైతిక నాయకత్వంఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీడ్‌వర్క్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీ & సీఈఓ డా. వెంకట్రామ్ వసంతవాడ మాట్లాడుతూ, నేటి ఆధునిక కార్పొరేట్ యుగంలో కృత్రిమ మేధస్సు (AI), డేటా విశ్లేషణ, సమస్యల పరిష్కారం మరియు నిరంతర అభ్యాసం అత్యంత అవసరమని ఉద్ఘాటించారు. మేనేజ్‌మెంట్ నిపుణులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంత అవసరమో, దాన్ని సరైన నిర్ణయాలుగా మలిచే సామర్థ్యం కూడా అంతే ముఖ్యమన్నారు. కేవలం వేతనం, హోదాలను మాత్రమే కాకుండా నిజాయితీ, సామాజిక బాధ్యత, నైతిక విలువలను కూడా విజయానికి కొలమానాలుగా స్వీకరించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు…

65 ఏళ్ల ఘన చరిత్ర… బ్లూ సఫైర్ జూబ్లీ సంబరం ..

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శివ శివాని గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ (SSGI) అధ్యక్షురాలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీమతి ఆరతి సంపతి ప్రసంగిస్తూ, 1961 నుంచి 2026 వరకు 65 సంవత్సరాల సుదీర్ఘ విద్యా సేవలను పూర్తి చేసుకుని ‘బ్లూ సఫైర్ జూబ్లీ’ సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, సమగ్ర అభివృద్ధి, నైతిక విలువలతో కూడిన విద్యాబోధనే తమ ఆరు దశాబ్దాల ప్రయాణానికి బలమైన పునాది అని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థులు ఆర్జించిన జ్ఞానంతో దేశానికి, సంస్థకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.

విద్యార్థినికి పట్టానుఅందచేస్తున్న సీడ్‌వర్క్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీ & సీఈఓ డా. వెంకట్రామ్ వసంతవాడ

లక్ష్య సాధనలో క్రమశిక్షణే ఆయుధం..

సంస్థ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా. శైలేష్ సంపతి మాట్లాడుతూ, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిలో విద్యాసంస్థల పాత్ర అమూల్యమైనదని తెలిపారు. అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి దీపిక సంపతి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచి, క్రమశిక్షణ, సానుకూల దృక్పథంతో కలలను సాకారం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో SSIM డైరెక్టర్ డా. ఎస్.వి. రమణ రావు, అధ్యాపక బృందం విశేషంగా పాల్గొన్నారు.

మెరిసిన ప్రతిభావంతులు… పతకాల పంట

విద్యాభ్యాసంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ వేదికపై బంగారు పతకాలు, నగదు పురస్కారాలు ప్రదానం చేశారు. బాసుపల్లి తరుణి రెడ్డికి పీజీడీఎం (ఓవరాల్) ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్‌తో పాటు రూ. 50,000 నగదు బహుమతి, ఫైనాన్స్ విభాగంలో లక్ష్మీదేవి మెమోరియల్ గోల్డ్ మెడల్ (రూ. 25,000) లభించాయి. అలాగే మార్కెటింగ్‌లో మదారపు శ్రేష్ఠ మహాన్ (శివరాజ్ మెమోరియల్ – రూ. 25,000), హెచ్‌ఆర్‌లో అరుట్ల అభినయ (కవిత మెమోరియల్ – రూ. 25,000), అగ్రి బిజినెస్‌లో బదావత్ సాయి చందన (ఎస్.పి. సంపతి మెమోరియల్ – రూ. 25,000) పతకాలు సాధించారు. బ్యాంకింగ్ (BIFS) విభాగంలో పెశెట్టి అమృత లక్ష్మి కృష్ణప్రియ, బిజినెస్ అనలిటిక్స్ (BA) విభాగంలో విస్లావత్ గౌతమి ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్స్‌తో పాటు ఒక్కొక్కరు రూ. 50,000 చొప్పున నగదు పురస్కారాలు అందుకున్నారు.

పట్టాలను అందుకున్న విద్యార్థులు….
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments