HomeNATIONAL - INTERNATIONALమల్లారెడ్డి వర్సిటీలో ‘ఎన్‌–జెన్‌’ తపాలా కార్యాలయం

మల్లారెడ్డి వర్సిటీలో ‘ఎన్‌–జెన్‌’ తపాలా కార్యాలయం

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ చేపట్టిన ఆధునీకరణలో భాగంగా సరికొత్త హంగులతో సిద్ధమైన ‘ఎన్‌–జెన్‌’ పోస్టల్ కార్యాలయాన్ని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.

*_ హైటెక్‌ హంగులతో పోస్టల్‌ సేవలు ..

*_ విద్యార్థులకు స్పీడ్‌ పోస్టుపై 10% రాయితీ ..

*_ ఆకట్టుకుంటున్న ‘మై స్టాంప్‌’, ఉచిత వైఫై సదుపాయాలు..

*_ ఆధార్‌ క్యాంప్‌, లైబ్రరీ కార్నర్‌ ఏర్పాటు ..

*_ ముఖ్య అతిథిగా హాజరైన యూనివర్సిటీ చైర్మన్ మల్లారెడ్డి..

లోకల్ వైబ్స్, జీడిమెట్ల: సాంప్రదాయ తపాలా సేవలను ఆధునిక సాంకేతికతతో అనుసంధానిస్తూ, యువతకు మరింత చేరువ చేసేందుకు మల్లారెడ్డి పోస్టాఫీసును అత్యాధునిక ‘ఎన్‌–జెన్‌ (నెక్స్ట్‌ జనరేషన్‌)’ కార్యాలయంగా తీర్చిదిద్దారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ చేపట్టిన ఆధునీకరణలో భాగంగా సరికొత్త హంగులతో సిద్ధమైన ఈ కేంద్రాన్ని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఛైర్మన్‌ చామకూర మల్లారెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించారు. తపాలా కార్యాలయాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థి కేంద్రీకృతంగా తీర్చిదిద్దడం అభినందనీయమని అతిథులు కొనియాడారు. కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ వి.ఎస్‌.కె. రెడ్డి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె. శ్రీనివాసరావు, సికింద్రాబాద్‌ డివిజన్‌ తపాలా శాఖ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఎం. అనన్యప్రియ పాల్గొన్నారు.

మల్లారెడ్డి వర్సిటీలో ‘ఎన్‌–జెన్‌’ తపాలా కార్యాలయ ప్రారంభోత్సవంలో యూనివర్సిటీ చైర్మన్ మల్లారెడ్డి, సికింద్రాబాద్ డివిజన్ తపాలా శాఖ సీనియర్ సూపరిటెండెంట్ ఎం అనన్యప్రియ తదితరులు….

అన్ని సౌకర్యాలతో.. ఆపై విద్యార్థులకు రాయితీ..

ఈ కేంద్రం అన్ని పనిదినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని అధికారులు తెలిపారు. సాధారణ ఉత్తరాలు, పార్శిల్‌ సర్వీసులు, పొదుపు పథకాలు, పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సేవలన్నీ ఇక్కడ యథావిధిగా కొనసాగుతాయి. వీటితో పాటు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్పీడ్‌ పోస్ట్‌ సేవలపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నారు. అంతేకాకుండా కార్యాలయానికి వచ్చే సందర్శకుల కోసం ఉచిత వైఫై సదుపాయం, కాఫీ వెండింగ్‌ యంత్రం, పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు రీడింగ్‌ కార్నర్‌, విద్యార్థులు పరస్పరం చర్చించుకునేందుకు ప్రత్యేక వేదికను అందుబాటులోకి తెచ్చారు. ప్రజల సౌలభ్యం కోసం ప్రత్యేక ఆధార్‌ కేంద్రాన్ని, సొంత చిత్రాలతో ప్రత్యేక పోస్టల్‌ స్టాంపులను ముద్రించుకునే ‘మై స్టాంప్‌’ కౌంటర్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఖాతాలు సులభంగా ప్రారంభించే సదుపాయంతో పాటు తపాలా అంశాలతో కూడిన వినోదాత్మక ఆటలను ఇక్కడ సిద్ధం చేశారు. తపాలా శాఖపై నమ్మకాన్ని కొనసాగిస్తూనే, ఆధునిక సాంకేతికతతో ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని పోస్టల్ శాఖ అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments