HomeCUREకొంపల్లిలో కొత్త “యు-టర్న్‌” పరిశీలన..

కొంపల్లిలో కొత్త “యు-టర్న్‌” పరిశీలన..

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

నిత్యం రద్దీగా ఉండే నేషనల్ హైవే రహదారి కొంపల్లిలోని క్రోమా వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన యు-టర్న్ ప్రాంతాన్ని మేడ్చల్‌ జోన్‌ ట్రాఫిక్‌ డీసీపీ శేషాద్రిణి రెడ్డి మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు.

అధికారులకు మేడ్చల్‌ డీసీపీ శేషాద్రిణి రెడ్డి సూచనలు..

లోకల్ వైబ్స్, కొంపల్లి: నిత్యం రద్దీగా ఉండే నేషనల్ హైవే రహదారి కొంపల్లిలోని క్రోమా వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన యు-టర్న్ ప్రాంతాన్ని మేడ్చల్‌ జోన్‌ ట్రాఫిక్‌ డీసీపీ శేషాద్రిణి రెడ్డి మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా యు-టర్న్ వద్ద వాహనాల రాకపోకలను, మలుపు తీసుకుంటున్న తీరును డీసీపీ నిశితంగా పరిశీలించారు. ప్రధాన రహదారిపై వాహనదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రయాణం వేగంగా, సురక్షితంగా సాగేలా పలు మార్పులు సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించి, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ట్రాఫిక్‌ అధికారులు పాల్గొన్నారు.

నూతనంగా ఏర్పాటు చేసిన యూటర్న్ వద్ద ట్రాఫిక్ ను పరిశీలిస్తూ పలు సూచనలు చేస్తున్న డిసిపి శేషాద్రిని రెడ్డి…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments