గాజుల రామారం కైసర్ నగర్ డబుల్ బెడ్రూమ్ (2BHK డిగ్నిటీ హౌసింగ్ సొసైటీ) ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది.
కైసర్ నగర్ 2BHK డిగ్నిటీ హౌసింగ్ సొసైటీలో ఉచిత వైద్య శిబిరం..
_ 200 మందికి పైగా వైద్య సేవలు..
_ ఎంఎన్ఆర్ హెల్పింగ్ హాండ్స్, కారుణ్య ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
లోకల్ వైబ్స్, కైసర్ నగర్: గాజుల రామారం కైసర్ నగర్ డబుల్ బెడ్రూమ్ (2BHK డిగ్నిటీ హౌసింగ్ సొసైటీ) ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. సొసైటీలోని 7వ బ్లాక్, షాప్ నంబర్ 4, 5 లలో ఆర్ ఎం పి డాక్టర్ నరేంద్ర ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన ‘ఆరోగ్య హెల్త్ సెంటర్ ఎంఎన్ఆర్ మెడికల్’ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎంఎన్ఆర్ హెల్పింగ్ హాండ్స్.. కారుణ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో…
డాక్టర్ మణిరత్నం సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత మెడికల్ క్యాంప్‌కు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. సుమారు 200 మందికి పైగా ప్రజలు ఈ శిబిరానికి విచ్చేసి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు.ఈ సేవా కార్యక్రమంలో 2BHK సొసైటీ చైర్మన్, ప్రెసిడెంట్, సెక్రెటరీలతో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు చురుగ్గా పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి, దూదిమెట్లు సురేష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ద్వారంపూడి నాగిరెడ్డి, గుబ్బల లక్ష్మినారాయణ, పోలె శ్రీకాంత్, సంగం వీరేష్ గుప్తా, లోచారం వెంకటరమణ, వట్టం విష్ణు వర్ధన్ గుప్తా, నక్క భరత్, కనకటల శివతదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని, వైద్య శిబిరం విజయవంతం కావడానికి తమ వంతు కృషి చేశారు. స్థానికంగా ఇలాంటి ఉచిత వైద్య సేవలు అందించడం పట్ల సొసైటీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.


