జీడిమెట్ల సర్కిల్ పద్మా ఫేజ్-2, సాయిబాబా ఆలయ సమీపంలో నిర్మిస్తున్న ఓ బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో రోజువారీ పనులకు హాజరయ్యాడు. ఐదో అంతస్తు వద్ద సామగ్రిని పైకి లాగుతున్న సమయంలో క్రేన్ మిషన్ బేరింగ్‌లు అకస్మాత్తుగా ఊడిపోయాయి. దీంతో నియంత్రణ కోల్పోయిన కుమార్ ఒక్కసారిగా కిందపడిపోవడంతో తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మృతిచెందాడు.
_ ఐదో అంతస్తు నుంచి పడి కార్మికుడి మృతి…
_ న్యాయం కోరిన బాధితులపై లాఠీఛార్జ్..
లోకల్ వైబ్స్, కుత్బుల్లాపూర్: నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన సిలివేరు కుమార్ (35) బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి గాజులరామారంలో నివాసముంటున్నాడు. నిర్మాణ సామగ్రిని పైఅంతస్తులకు చేరవేసే క్రేన్ మెటీరియల్ మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పద్మనగర్ ఫేజ్-2, సాయిబాబా ఆలయ సమీపంలో నిర్మిస్తున్న ఓ బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో రోజువారీ పనులకు హాజరయ్యాడు. ఐదో అంతస్తు వద్ద సామగ్రిని పైకి లాగుతున్న సమయంలో క్రేన్ మిషన్ బేరింగ్‌లు అకస్మాత్తుగా ఊడిపోయాయి. దీంతో నియంత్రణ కోల్పోయిన కుమార్ ఒక్కసారిగా కిందపడిపోవడంతో తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మృతిచెందాడు.భవన యజమాని కనీస రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బాధితుల తరుపున న్యాయం అడుగుతున్న వారి పై లాఠీఛార్జ్..
కుమార్ మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, తోటి కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై ఒక్కసారిగా లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. అనంతరం మరోమారు లాఠీలకు పనిచెప్పి బాధితుల తరఫున వచ్చిన వారిని అక్కడినుంచి వెళ్లగొట్టారు. ఈ క్రమంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక ట్రేడ్ యూనియన్ కుత్బుల్లాపూర్ మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డిపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో పోలీసులు దాడి చేశారు అని మండిపడ్డారు తోటి కార్మికులు.


