శివ శివాని గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ 65 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణాన్ని పురస్కరించుకుని ఆగస్టు 3, సోమవారం సాయంత్రం 5:30 గంటలకు ‘బ్లూ సఫైర్ జూబిలీ’ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నాయి.
_ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎంపీ నిరంజన్ రెడ్డి
లోకల్ వైబ్స్, కొంపల్లి: ప్రముఖ విద్యా సంస్థలైన శివ శివాని గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ 65 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణాన్ని పురస్కరించుకుని ఆగస్టు 3, సోమవారం సాయంత్రం 5:30 గంటలకు ‘బ్లూ సఫైర్ జూబిలీ’ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నాయి. కొంపల్లిలోని హైందవ గౌరిక్ కన్వెన్షన్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి.ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయనుండగా, కార్గిల్ యుద్ధవీరుడు, ట్రైయాథ్లాన్ ఛాంపియన్ కల్నల్ గౌరవ్ దత్తా (రిటైర్డ్) గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, విద్యావేత్తల సమక్షంలో ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

