గాజులరామారం గ్రామ సర్వే నెంబర్ 342 ప్రభుత్వ భూమినీ మట్టి పోసి చదును చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై కుత్బుల్లాపూర్ రెవిన్యూ అధికారులు పోలీసులకు పిర్యాదు చేశారు.
*–గాజులరామారంలో సర్వే నంబర్ 342లో జేసీబీతో మట్టి చదును.. ఇద్దరిపై కేసు నమోదు*
*– ప్రభుత్వ స్థలంలో అక్రమ మట్టి డంపింగ్.. అంటూ ఫిర్యాదు*
లోకల్ వైబ్స్, గాజులరామారం: నగర శివారులోని గాజులరామారంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కొందరు చేసిన యత్నాన్ని రెవెన్యూ అధికారులు మరోసారి అడ్డుకున్నారు. అక్రమంగా మట్టిని డంప్ చేసి, జేసీబీతో చదును చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
*సర్వే నెంబర్ 342 లో..*
గాజులరామారంలోని కైజర్ నగర్, షాహీన్ మసీదు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 342 లో కొందరు వ్యక్తులు మట్టిని పోసి నేలను చదును చేస్తున్నారని కుత్బుల్లాపూర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) గులాం కలీమ్కు సమాచారం అందింది.వెంటనే ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అక్కడ ఒక జేసీబీ (JCB) తో భూమిని చదును చేసే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వెంటనే పనులను అడ్డుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ కలీమ్ పనులు చేస్తున్న జేసీబీ డ్రైవర్ తో పాటుగా పనులు చేపిస్తున్న మరో వ్యక్తి పై పోలీసులకు పిర్యాదు చేశారు.
*కేసు నమోదు చేసిన పోలీసులు*
ప్రభుత్వ భూమిలో అక్రమంగా ప్రవేశించి, మట్టి పోసి చదును చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ గులాం కలీమ్ సూరారం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు.

