HomeCUREబాచుపల్లి 'పెగ్ బ్రో' పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడి

బాచుపల్లి ‘పెగ్ బ్రో’ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడి

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

సైబరాబాద్ పరిధిలోని బాచుపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి నడుస్తున్న ‘పెగ్ బ్రో’ (PEG BRO) పబ్‌పై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. డీజే సౌండ్స్‌తో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నందుకు ఎఫ్.ఐ.ఆర్ నమోదు.

*– .. యజమాని సహా 9 మందిపై కేసు*

బాచుపల్లిలో అర్ధరాత్రి పోలీసుల ఆకస్మిక దాడి.. నిబంధనలు ఉల్లంఘించిన ‘పెగ్ బ్రో’ పబ్!

లోకల్ వైబ్స్, బాచుపల్లి : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లిలో నిబంధనలు ఉల్లంఘించిన ఒక పబ్‌పై పోలీసులు కొరడా ఝుళిపించారు. అనుమతించిన సమయం దాటిన తర్వాత కూడా అర్ధరాత్రి వేళ పబ్ నడుపుతూ స్థానికులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్న ‘పెగ్ బ్రో’ (PEG BRO) పబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

*అర్ధరాత్రి డీజే మోతలు.. *

తెల్లవారుజామున 02:15 గంటల సమయంలో రేణుక ఎల్లమ్మ కాలనీలోని పెగ్ బ్రో పబ్‌పై బాచుపల్లి పోలీసులు పబ్‌పై ఆకస్మిక దాడులు చేశారు. ఆ సమయంలో పబ్ నిర్వాహకులు డీజే (DJ) సిస్టమ్ ద్వారా పెద్ద శబ్దంతో పాటలు పెడుతూ, జనాన్ని పోగుచేసి పబ్లిక్ న్యూసెన్స్ (Public Nuisance) కలిగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

*లైసెన్స్ నిబంధనల ఉల్లంఘన..?*

రాత్రి పొద్దుపోయిన తర్వాత పబ్ నడపడానికి ఎలాంటి అనుమతి పత్రాలు పబ్ మేనేజ్మెంట్ పోలీసులకు చూపించలేకపోయింది. దీంతో వారు లైసెన్సింగ్, శబ్ద కాలుష్య (Noise Pollution) నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు నిర్ధారించారు. పబ్‌లో పెద్ద శబ్దం చేయడానికి ఉపయోగిస్తున్న ఒక డీజే (DJ) కన్సోల్, రెండు స్పీకర్లను పోలీసులు స్వాధీనం (సీజ్) చేసుకున్నారు.

*9 మందిపై కేసు..*

ఈ ఘటనలో పబ్ యజమానితో సహా మొత్తం 9 మంది సిబ్బందిపై బాచుపల్లి పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. నిందితులను, సీజ్ చేసిన వస్తువులను తదుపరి చర్యల నిమిత్తం బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నివాస ప్రాంతాల్లో అర్ధరాత్రి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments