HomeCUREకొంపల్లిలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం..

కొంపల్లిలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం..

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

భారతీయ జనతా పార్టీ (BJP) 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొంపల్లి డివిజన్‌లో వేడుకలు అంబరాన్నంటాయి. కొంపల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షులు సతీష్ సాగర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.

*– సతీష్ సాగర్ ఆధ్వర్యంలో కమలం జెండా రెపరెపలు *

*– కొంపల్లి డివిజన్ వ్యాప్తంగా ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

*_ డివిజన్ అధ్యక్షులు సతీష్ సాగర్ ఆధ్వర్యంలో పలు కాలనీల్లో బీజేపీ జెండా ఆవిష్కరణ.

*_ ముఖ్యఅతిథులుగా హాజరైన జిల్లా ఇంచార్జి అధ్యక్షులు ఎస్. మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు ఏ. రాజిరెడ్డి.

* _రానున్న ఎన్నికల్లో కొంపల్లి డివిజన్‌ను బీజేపీ కైవసం చేసుకునేలా ప్రతి కార్యకర్తా కృషి చేయాలని నాయకుల పిలుపు.

*_ కొంపల్లిలో పండుగ వాతావరణంలో ఆవిర్భావ వేడుకలు.

లోకల్ వైబ్స్, కొంపల్లి: భారతీయ జనతా పార్టీ (BJP) 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొంపల్లి డివిజన్‌లో వేడుకలు అంబరాన్నంటాయి. కొంపల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షులు సతీష్ సాగర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా ఇంచార్జి అధ్యక్షులు ఎస్.మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని కొంపల్లి మార్కెట్ రోడ్డు, సెంట్రల్ పార్క్, పోచమ్మ గడ్డ, ఎన్.సి.ఎల్ కాలనీ, జయాబేరి పార్క్, దూలపల్లి, శ్రీనివాస కాలనీ తదితర కీలక ప్రాంతాలలో పార్టీ జెండాలను ఎగురవేసి, బీజేపీ స్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

*దేశం, ధర్మం కోసమే బీజేపీ: ఎస్. మల్లారెడ్డి.*

ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి అధ్యక్షులు ఎస్. మల్లారెడ్డి మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను, లక్ష్యాలను కార్యకర్తలకు వివరించారు. “భారతీయ జనతా పార్టీ ఒక బలమైన సైద్ధాంతిక పునాదిపై ఏర్పడింది. అనునిత్యం దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తూ, అర్హులైన చిట్టచివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందేలా బీజేపీ అహర్నిశలు కృషిచేస్తోంది,” అని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.

పార్టీ జెండాను ఎగరవేస్తున్న జిల్లా ఇంచార్జి అధ్యక్షులు ఎస్. మల్లారెడ్డి,

*కొంపల్లి డివిజన్‌పై బీజేపీ గురి: సతీష్ సాగర్*

అనంతరం కార్యక్రమ నిర్వాహకులు, డివిజన్ అధ్యక్షులు సతీష్ సాగర్ మాట్లాడుతూ పార్టీ ఎదుగుదలను కొనియాడారు. ఎంతో మంది మహనీయుల త్యాగాలు, కృషితోనే నేడు బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని ఆయన గుర్తుచేశారు. జాతీయ నాయకుల అడుగుజాడలలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో కొంపల్లి డివిజన్‌ను బీజేపీ కైవసం చేసుకునేలా కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

పార్టీ నాయకులకు మిఠాయి తినిపిస్తున్న డివిజన్ అధ్యక్షులు సతీష్ సాగర్

*పెద్ద సంఖ్యలో హాజరైన నాయకులు, కార్యకర్తలు*

ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి సరిత రావు, జిల్లా నాయకులు జనార్ధన్ రెడ్డి, శివాజీ రాజు, శంకర్ నాయక్, అశోక్, నరసింహ, చక్రధర్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments