‘సాక్షిత’ పత్రిక ఎడిటర్ తేజోమూర్తి తల్లి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. చికిత్సకు భారీగా ఖర్చు అవుతుంది. ఈ విషయాన్ని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకుల ద్వారా తెలుసుకున్న శంకర్‌నాయక్ మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఆర్థిక సహాయం చేశారు.
_ దుండిగల్ మాజీ కౌన్సిలర్ ఆర్థిక చేయూత..
_ స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్న పాత్రికేయులు..
లోకల్ వైబ్స్, కుత్బుల్లాపూర్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ పాత్రికేయుడి తల్లి వైద్య ఖర్చుల నిమిత్తం దుండిగల్ మాజీ కౌన్సిలర్ శంకర్‌నాయక్ ఆర్థిక సాయం అందజేశారు. కుత్బుల్లాపూర్ కు చెందిన ‘సాక్షిత’ పత్రిక ఎడిటర్ తేజోమూర్తి తల్లి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. చికిత్సకు భారీగా ఖర్చు అవుతుంది. ఈ విషయాన్ని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకుల ద్వారా తెలుసుకున్న శంకర్‌నాయక్ మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అనంతరం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో రూ.21 వేల నగదును తేజోమూర్తికి అందజేశారు. కష్టకాలంలో పాత్రికేయుడి కుటుంబానికి అండగా నిలిచిన శంకర్‌నాయక్‌కు యూనియన్ నాయకులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా చికిత్స కోసం ఇంకా అధిక మొత్తంలో డబ్బులు అవసరం పడతాయని, స్పందించి ఆదుకోవాల్సిందిగా పలువురు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు గోలిపల్లి దయాకర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిబాబా, ప్రధాన కార్యదర్శి రెడ్డెబోయిన మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


