HomeCUREవెన్నెలగడ్డలో “మద్యం” సెగ…!

వెన్నెలగడ్డలో “మద్యం” సెగ…!

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

– నిబంధనలు తుంగలో తొక్కి వైన్ షాపునకు లైసెన్స్?

– స్థానికుల అబ్జెక్షన్ పరిగణంలోకి తీసుకోకుండానే అనుమతులు..?

– బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయొద్దని స్థానికులు ఆందోళన

– అన్ని శాఖల అధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు

లోకల్ వైబ్స్, హైదరాబాద్, మార్చి 11, 2026: “నిబంధనలు చట్టానికా? లేక చుట్టానికా? చిన్నారి విద్యార్థులు చదువుకునే బడులు.. భక్తులు కొలిచే గుడులకు అత్యంత సమీపంలోని మద్యం షాపులకు అనుమతులా? నివాస ప్రాంతాల్లో నిబంధనలు తుంగలో తొక్కి వైన్ షాపులు ఏర్పాటు చేస్తున్న తీరుపై వెన్నెలగడ్డ ప్రజలు ఇప్పుడు సమరశంఖం పూరించారు! అధికారుల కళ్లు గప్పి ఎన్ఓసి ఇచ్చారా? లేక ప్రజా ఆవేదనను బేఖాతరు చేస్తున్నారా? స్థానికుల ఆందోళనతో మద్యం బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుపై తలెత్తుతున్న ప్రశ్నలు ఇవి.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వెన్నెలగడ్డ ప్రాంతం ఇప్పుడు ఒక మద్యం షాపు ఏర్పాటు వివాదానికి కేంద్రబిందువుగా మారింది. నివాస ప్రాంతాల మధ్య, పాఠశాలలు మరియు దేవాలయాలకు అతి సమీపంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై స్థానిక ప్రజలు భగ్గుమంటున్నారు. ఎక్సైజ్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనావాసాలు కలిగి ఉన్న ప్రాంతంలో మద్యం సంబంధిత దుకాణాలు ఏర్పాటు చేయొద్దని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

వెన్నెలగడ్డ లో మద్యం సంబంధిత దుకాణం ఏర్పాటు చేయొద్దని మంగళవారం ఆందోళన చేస్తున్న స్థానికులు.

అధికారులకు ఫిర్యాదు..
నిబంధనల ఉల్లంఘనపై స్థానికుల ఆవేదన
వెన్నెలగడ్డ నివాసితులు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ తో పాటుగా వివిధ శాఖల అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రతిపాదిత మద్యం దుకాణం అనేక చట్టపరమైన నిబంధనలను అతిక్రమిస్తోంది అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక ప్రైవేట్ పాఠశాల ఈ స్థలానికి 100 మీటర్ల లోపే ఉంది అని. అలాగే 150 మీటర్ల దూరంలో ఒక ప్రభుత్వ పాఠశాల, 100 మీటర్ల లోపు ఒక దేవాలయం ఉండటంతో, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అక్కడివారు ఆందోళన చెందుతున్నారు.
అత్యంత ఇరుకైన రోడ్డుపై ఈ దుకాణం రావడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుపుతాయని ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బార్ అండ్ రెస్టారెంట్ కు ఇచ్చిన లైసెన్సు ఎన్వోసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?
సాధారణంగా ఒక మద్యం దుకాణానికి లైసెన్స్ ఇచ్చే ముందు ఎక్సైజ్ శాఖ కఠినమైన నిబంధనలను అనుసరించాలి. NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) ఇచ్చే ప్రక్రియలో తెలంగాణ ఎక్సైజ్ చట్టం ప్రకారం, విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు ఆసుపత్రుల నుండి మద్యం దుకాణం కనీసం నిర్ణీత దూరంలో (సాధారణంగా 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ, మున్సిపల్ పరిమితులను బట్టి) ఉండాలి.
ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ స్వయంగా స్థలాన్ని సందర్శించి, కొలతలు తీయాలి. పాఠశాల లేదా గుడి వాకిలి నుండి వైన్ షాప్ వాకిలి వరకు ఉన్న దూరాన్ని శాస్త్రీయంగా లెక్కించాలి. సదరు ప్రాంతంలో షాపు ఏర్పాటు వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందా లేదా ట్రాఫిక్ సమస్యలు వస్తాయా అనే అంశంపై స్థానిక పోలీస్ (SHO), మున్సిపల్ అధికారుల అభిప్రాయం తీసుకోవాలి.

ఎన్ఓసి ఉన్నదా..?
ఒక ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటుపై స్థానికులు సామూహికంగా అభ్యంతరం వ్యక్తం చేస్తే, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కలెక్టర్ లేదా ఎక్సైజ్ కమిషనర్ ఆ లైసెన్స్‌ను నిలిపివేసే అధికారం కలిగి ఉంటారు. “NOC లేకుండా లేదా తప్పుడు నివేదికలతో లైసెన్స్ ఎలా ఇస్తారు?” అని వెన్నెలగడ్డ నివాసితులు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను కప్పిపుచ్చి అధికారులు నివేదికలు ఇచ్చి ఉంటే, అది చట్టవిరుద్ధమని వారు వాదిస్తున్నారు. అందుకే, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిపి సంయుక్త తనిఖీ నిర్వహించాలని, భవిష్యత్తులో అక్కడ తలెత్తే తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఫిర్యాదుకు స్పందిస్తారా..?
నివాసితుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని అధికారులు, లైసెన్స్ ప్రక్రియను నిలిపివేస్తారా..? లేక నిబంధనలను పక్కన పెట్టి ముందుకు సాగుతారా..? అనేది వేచి చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments