HomeCUREఇంటర్ ఫలితాల్లో “భాగ్యరధి” విద్యార్థుల ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో “భాగ్యరధి” విద్యార్థుల ప్రభంజనం

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో భాగ్యరధి డిగ్రీ & జూనియర్ కళాశాల విద్యార్థులు తమ అత్యుత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. మొదటి సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు ద్వితీయ విద్యా సంవత్సరానికి గాను ఉచిత విద్యను అందించినట్లు యాజమాన్యం ప్రకటించింది.

– అన్ని గ్రూపుల్లోనూ అద్భుత ప్రతిభ..

– సెకండ్ ఇయర్‌లో అవేజ్ (993), అమృత్, శివం ప్రసాద్ (982).. ఫస్ట్ ఇయర్‌లో శ్రీ లక్ష్మి (491)ల మార్కుల ప్రభంజనం..

– సాధారణ విద్యార్థులు సైతం టాపర్లుగా స్థానం..

_ విద్యార్థులకు ఆర్థికంగా, విద్యాపరంగా అండగా నిలుస్తున్న యాజమాన్యం..

– ఫస్ట్ ఇయర్ టాపర్లకు బంపర్ ఆఫర్..

_ సెకండ్ ఇయర్‌లో పూర్తి ఉచిత విద్యను ప్రకటించిన డైరెక్టర్ జై శంకర్ గౌడ్..

_ ఇంటర్‌తో పాటే ఎంట్రన్స్‌పైనా ఫోకస్..

_ జేఈఈ, నీట్, ఎంసెట్ ర్యాంకర్లకు నగదు బహుమతులు అందజేస్తామన్న డైరెక్టర్లు..

లోకల్ వైబ్స్, చింతల్: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో భాగ్యరధి డిగ్రీ & జూనియర్ కళాశాల విద్యార్థులు తమ అత్యుత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన అన్ని గ్రూపులలో (MPC, BiPC, MEC, CEC) అత్యధిక మార్కులు సాధించి, కళాశాల కీర్తి పతాకను ఎగురవేశారు. ఈ అద్భుత విజయాలు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో అద్భుత ఫలితాలు సాధించిన సందర్భంగా కళాశాల ప్రాంగణం వద్ద సంబరాలు చేసుకుంటున్న భాగ్యరధి కళాశాల విద్యార్థులు , యాజమాన్యం..

*ప్రథమ సంవత్సరంలో సత్తా చాటిన విద్యార్థులు*

ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో భాగ్యరధి విద్యార్థులు ముందంజలో నిలిచారు. MEC గ్రూపులో బి. శ్రీ లక్ష్మి 491/500 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరచగా, MPC గ్రూపులో బి. అస్మిత 468/470, CEC గ్రూపులో అంబ్రిన్ బేగం 485/500 మార్కులు సాధించారు. అలాగే BiPC గ్రూపులో జి. విష్ణు తేజ 433/440 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు.

ప్రథమ సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు..

*ద్వితీయ సంవత్సరంలో మార్కుల పంట*

సెకండ్ ఇయర్ ఫలితాల్లోనూ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. BiPC గ్రూపులో అవేజ్ ఏకంగా 993/1000 మార్కులు సాధించి రికార్డు సృష్టించాడు. MPC గ్రూపులో అమృత్, శివం ప్రసాద్ ఇద్దరూ 982/1000 మార్కులతో సత్తా చాటారు. CEC గ్రూపులో శ్రావణి 981/1000, MEC గ్రూపులో సానియా బేగం 979/1000 మార్కులు సాధించి అందరి మన్ననలు పొందారు.

ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు…

*పేద విద్యార్థులకూ అండగా యాజమాన్యం*

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎన్. వెంకటరెడ్డి మాట్లాడుతూ పదవ తరగతిలో కేవలం సాధారణ మార్కులు సాధించిన విద్యార్థులకు సైతం సరైన మార్గదర్శకత్వం అందిస్తే, ఇంటర్‌లో ఇలాంటి అద్భుత ఫలితాలు సాధించగలరని ఈ విజయాలు రుజువు చేశాయన్నారు. అలాంటి విద్యార్థులకు విద్యాపరంగా, ఆర్థికంగా అండగా నిలిచేందుకు కళాశాల యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు.

*టాపర్లకు ఉచిత విద్య, నగదు బహుమతుల ప్రకటన*

కళాశాల విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు డైరెక్టర్లు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. ప్రథమ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ద్వితీయ సంవత్సరంలో పూర్తి ఉచిత విద్యను అందిస్తామని డైరెక్టర్ నల్ల జై శంకర్ గౌడ్ ప్రకటించారు. అలాగే డైరెక్టర్ కె. రామకృష్ణ మాట్లాడుతూ.. ఇంటర్ మార్కులతో పాటు రాబోయే JEE Mains, NEET, EAPCET తదితర పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించే విద్యార్థులకు ప్రత్యేక నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు.

*విద్యతో పాటు క్రమశిక్షణే గెలుపుకు సోపానం*

ఉత్తమ ఫలితాల సాధనలో విద్యతో పాటు క్రమశిక్షణ కూడా ఎంతో కీలకమని జి. రమేష్ బాబు పేర్కొన్నారు. భాగ్యరధి విద్యార్థులు క్రమశిక్షణలో ఇతర కళాశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన ప్రశంసించారు. విద్యార్థుల ఈ విజయాల వెనుక నిరంతరం శ్రమించిన అధ్యాపకులకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments