మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ తమ ఆవేదనను ప్రజావాణి వేదిక ద్వారా తెలియజేయడానికి వెళ్లిన పద్మా నగర్ ఫేస్ 1 వాసులకు నిరాశ ఎదురైంది. కుత్బుల్లాపూర్ డివిజన్ జలమండలి కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమంలో ఎవరూ లేకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణి కార్యక్రమం నిర్వహించకపోగా తమ సమస్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల తీరుకు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమకు తగినంత త్రాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఈ మేరకు వాటర్ వర్క్స్ ఆఫీసు ప్రాంగణం లో సోమవారం ఆందోళనకు దిగారు.
_ త్రాగునీటి సమస్యను వివరించేందుకు వెళ్లిన కాలనీవాసులకు చుక్కెదురు..
_ వాటర్ వర్క్స్ ఆఫీసులో పద్మనగర్ ఫేస్-1 వాసుల ధర్నా
_ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు
_ ప్రజావాణి కార్యక్రమం ఎక్కడ అంటూ ఖాళీ కుర్చీల ఫోటోలు మాధ్యమాలలో షేరింగ్..
లోకల్ వైబ్స్ , చింతల్: దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను ప్రతి సోమవారం అధికారికంగా నిర్వహించే ప్రజావాణి వేదిక ద్వారా వివరించేందుకు వెళ్లిన కాలనీవాసులకు తీవ్ర నిరాసే మిగిలింది. ప్రజావాణి కార్యక్రమం నిర్వహించకపోగా తమ సమస్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల తీరుకు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు పద్మా నగర్ ఫేస్ 1 వాసులు. తమకు తగినంత త్రాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ వారు వాటర్ వర్క్స్ ఆఫీసులో సోమవారం ఆందోళనకు దిగారు.
కుత్బుల్లాపూర్ డివిజన్ జలమండలి కార్యాలయం ముందు నిరసన నినాదాలు చేస్తున్న పద్మా నగర్ ఫేస్ 1 వాసులు.
ప్రజావాణిలో ఫిర్యాదు చేద్దామని వెళితే…
‘ప్రజావాణి’ కార్యక్రమంలో తమ త్రాగునీటి కష్టాలను అధికారుల దృష్టికి తీసుకెళ్దామని ఆశగా వచ్చిన కాలనీవాసులకు అధికారుల నుంచి నిర్లక్ష్యం ఎదురైంది. ప్రజావాణి సమయానికి ఆఫీసులో బాధ్యతగల అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అక్కడికి వచ్చిన జనరల్ మేనేజర్ మాధవి తమ గోడు వింటారని ఆశించిన స్థానికులకు నిరాశే మిగిలింది. ఆమె తమ సమస్యలు ఏమాత్రం వినకుండానే అక్కడినుండి తిరిగి వెళ్లిపోయారని కాలనీవాసులు ఆరోపించారు.నీటి ఎద్దడితో తాము అల్లాడుతుంటే, కనీసం స్పందించాల్సిన అధికారుల తీరు వారి తీవ్ర నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలుస్తోందని వారు అధికారులను విమర్శించారు. వెంటనే తమ కాలనీకి తగినంత త్రాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ, వాటర్ వర్క్స్ ఆఫీసు ప్రాంగణంలోనే బైఠాయించి ధర్నా నిర్వహించారు. జిఎం డౌన్ డౌన్… అంటూ నినాదాలు చేశారు.

ప్రజావాణి లో.. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి..
కాగా, వాటర్ వర్క్స్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని, జీఎం మాధవి గారి ప్రవర్తనను ఎండగడుతూ స్థానికులు ఈ మేరకు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఈ పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రతి సోమవారం విధిగా నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ, ఒక అధికారి కూడా అందుబాటులో లేకపోవడంతో కాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి అంటూ ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు.


