పదో తరగతి ఫలితాల్లో కొంపల్లి జోన్-2 పరిధిలోని శ్రీచైతన్య పాఠశాల (కొంపల్లి-5 బ్రాంచ్) విద్యార్థులు విజయదుందుభి మోగించారు. అద్భుతమైన మార్కులు సాధించి కొంపల్లి జోన్‌లో అగ్రస్థానంలో నిలిచారు.
_ కొంపల్లి జోన్ టాపర్‌గా అభినవ్ కుమార్ (593)..
_ రెండో స్థానంలో మేడ్చల్-1 బ్రాంచ్ విద్యార్థిని దీప్తి (592)..
_ 149 మందికి 500కు పైగా మార్కులు..
_ పాఠశాలలో మిన్నంటిన సంబరాలు..
లోకల్ వైబ్స్, కొంపల్లి : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో కొంపల్లి జోన్-2 పరిధిలోని శ్రీచైతన్య పాఠశాల (కొంపల్లి-5 బ్రాంచ్) విద్యార్థులు విజయదుందుభి మోగించారు. అద్భుతమైన మార్కులు సాధించి కొంపల్లి జోన్‌లో అగ్రస్థానంలో నిలిచారు. కొంపల్లి-5 బ్రాంచ్‌కు చెందిన విద్యార్థి అభినవ్ కుమార్ 593 మార్కులు సాధించి జోన్ టాపర్‌గా నిలవగా.. మేడ్చల్-1 బ్రాంచ్‌కు చెందిన విద్యార్థిని దీప్తి 592 మార్కులతో సెకండ్ టాపర్‌గా సత్తా చాటారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఈ ఇద్దరు విద్యార్థులను కొంపల్లి జోన్-2 ఏజీఎం కేఎస్‌ఆర్ ప్రత్యేకంగా అభినందించారు

రికార్డు స్థాయిలో మార్కుల పంట..
కొంపల్లి-5 బ్రాంచ్ విద్యార్థులు ఈ ఫలితాల్లో రికార్డు సృష్టించారు. ఈ ఒక్క బ్రాంచ్‌లోనే 580కి పైగా మార్కులను 12 మంది, 550కి పైగా మార్కులను 70 మంది విద్యార్థులు సొంతం చేసుకున్నారు. ఏకంగా 149 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు.
మిన్నంటిన సంబరాలు..
విద్యార్థుల అద్భుత విజయంతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయ బృందం టపాకాయలు కాల్చి, విద్యార్థులతో కలిసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ అద్భుత ఫలితాలపై కొంపల్లి జోన్-2 ఏజీఎం కేఎస్‌ఆర్, ప్రిన్సిపాళ్లు నాగమణి, చందు, మేడ్చల్ ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు, అకడమిక్ డీన్ గోవింద్, కోఆర్డినేటర్లు, ఇన్‌ఛార్జులు సీతారాం రెడ్డి, రాములు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా అభినందించారు.



