HomeCUREపదో తరగతి ఫలితాల్లో 'నేతాజీ' ప్రభంజనం

పదో తరగతి ఫలితాల్లో ‘నేతాజీ’ ప్రభంజనం

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

నూరు శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మార్కులు సాధించి అద్భుత ఫలితాలు సాధించారు నేతాజీ హై స్కూల్ విద్యార్థులు.

_ నూరు శాతం ఉత్తీర్ణత..

_ 51 మందికి 500కు పైగా మార్కులు..

లోకల్ వైబ్స్, సుభాష్ నగర్: ఎస్ ఎస్ సి (2025-26) పరీక్ష ఫలితాల్లో నేతాజీ హైస్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయదుందుభి మోగించారు. నూరు శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మార్కులు సాధించి అద్భుత ఫలితాలు సాధించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని సాక్షి పాల్ 600 మార్కులకు గాను 572 మార్కులు సాధించి పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానంలో (1st Rank) నిలిచింది. అలాగే అనీషా పర్చా 556 మార్కులు, విద్యార్థులు విఘ్నేష్, ఆదిత్య లు 554 మార్కులు, యశోద 552 మార్కులు, జ్ఞాన సింధు 551 మార్కులు సాధించి సత్తా చాటారు. ఏకంగా 51 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారని యాజమాన్యం తెలిపింది.

ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదలే కారణం..

ఈ అద్భుత విజయం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ సీహెచ్. మహేష్ కుమార్, అకాడమిక్ డైరెక్టర్ సీహెచ్. నందిని హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా అభినందించారు. ఉపాధ్యాయుల అంకితభావం, నిరంతర కృషి.. దానికి తోడు విద్యార్థుల పట్టుదలే ఈ ఘన విజయానికి కారణమని వారు కొనియాడారు. భవిష్యత్తులోనూ విద్యార్థులు ఇలాగే అద్భుత ఫలితాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందిస్తున్న నేతాజీ హై స్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్ మహేష్ కుమార్.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments