2025-2026 ఎస్సెస్సీ (పదవ తరగతి) పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో చింతల్ పరిధిలోని పద్మనగర్ ఫేజ్-2లో ఉన్న ‘శ్రీనిధి గ్లోబల్ స్కూల్’ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
_ స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థిని వైష్ణవి
లోకల్ వైబ్స్, చింతల్: ఇటీవల విడుదలైన 2025-2026 ఎస్సెస్సీ (పదవ తరగతి) పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో చింతల్ పరిధిలోని పద్మనగర్ ఫేజ్-2లో ఉన్న ‘శ్రీనిధి గ్లోబల్ స్కూల్’ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ ఫలితాల్లో పాఠశాలకు చెందిన వెన్నం వైష్ణవి 600 మార్కులకు గాను 579 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. అలాగే పెండ్యాల దీక్షిత (573/600), సాహిరాజు శ్రేష్ట శ్రీ (573/600), తంగుడు వేదశ్రీ (570/600), శృతి గజానన్ మోరే (568/600), నందూరి వల్లి శివాని (561/600), దేవకి భువన వాసవి (554/600) అత్యుత్తమ మార్కులు సాధించి సత్తా చాటారు.

విద్యార్థులకు యాజమాన్యం అభినందనలు
అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ నల్లపాటి రాజేశ్వరి, డైరెక్టర్ నల్లపాటి వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ కోమలి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రణాళికాబద్ధమైన బోధన, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని వారు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించి, ఎన్నో విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.



