ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గతంలో ట్రయల్ కోర్టు (సీబీఐ ప్రత్యేక కోర్టు) నిందితులందరినీ డిశ్చార్జ్ చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు సంస్థపై ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఇది ఢిల్లీ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని, ఎక్సైజ్ పాలసీ మార్పు కోసం రూ. 100 కోట్ల వరకు లంచాలు అందాయని పేర్కొన్నారు. వాట్సాప్ చాట్‌లు, అప్రూవర్ దినేష్ అరోరా సాక్ష్యాలను కోర్టుకు వివరించారు. తదుపరి విచారణ: ఈ కేసులో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన హైకోర్టు, తదుపరి విచారణను మార్చి 16, 2026కు వాయిదా వేసింది.
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.. సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై స్టే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi Liquor Policy Case) మరోసారి చర్చనీయాంశమైంది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. దర్యాప్తు సంస్థ తీరుపై గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలపై హైకోర్టు స్టే విధించింది.
ఢిల్లీ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్: తుషార్ మెహతా
ఈ విచారణలో సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వాదనలు వినిపించారు. ఇది ఢిల్లీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని ఆయన అభివర్ణించారు. ఎక్సైజ్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నిందితులు భారీగా లంచాలు ఇచ్చారని, సుమారు రూ. 100 కోట్ల వరకు చేతులు మారాయని కోర్టుకు తెలిపారు. హవాలా మార్గంలో వెళ్లిన డబ్బును గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆరోపించారు.
వాట్సాప్ చాట్‌లే కీలక ఆధారాలు..
పాలసీ మార్పుల కోసం జరిగిన కుట్రకు సంబంధించి విజయ్ నాయర్, బుచ్చిబాబు వంటి వ్యక్తుల వాట్సాప్ చాట్‌లు కీలక ఆధారాలని సీబీఐ పేర్కొంది. అలాగే, అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరా ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ దశలో నిందితులను డిశ్చార్జ్ చేయడం సరైన నిర్ణయం కాదని, సాక్ష్యాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదని మెహతా వాదించారు. సొలిసిటర్ జనరల్ వాదనలు విన్న హైకోర్టు, ఈ కేసులో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈడీ కేసు విచారణను కూడా వాయిదా వేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఈ కేసులో తదుపరి ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారిం

