ఎందరో అమరవీరుల త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైందని వీరారెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
_ సుచిత్ర సర్కిల్లో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం
_ తెలంగాణ ఉద్యమకారుడు వీరారెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో
లోకల్ వైబ్స్, సుచిత్ర: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుచిత్ర సర్కిల్లో మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు వీరారెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వీరారెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎందరో అమరవీరుల త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైందని గుర్తుచేశారు. నాడు ‘నీళ్లు – నిధులు – నియామకాలు’ నినాదంతో సాగిన మహోన్నత ఉద్యమం కోట్లాది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమన్నారు. అమరవీరుల ఆశయాలను స్మరించుకుంటూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కిషన్ రావు, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, జ్ఞానేశ్వర్, సమ్మయ్య, గోవర్ధన్ రెడ్డి, కుమార్, రామచంద్ర రెడ్డి, మధుకృష్ణ, కుంట వేణు, చంద్రశేఖర్ రెడ్డి, వీరంశెట్టి, శంకర్, రమణ రావులతో పాటు మహిళా నాయకురాళ్లు పద్మ, ఇందిర రెడ్డి, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



