HomeCUREశాంతిభద్రతల పరిరక్షణతోనే రాష్ట్రాభివృద్ధి

శాంతిభద్రతల పరిరక్షణతోనే రాష్ట్రాభివృద్ధి

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ అన్నారు.

_ జీడిమెట్ల పీఎస్‌లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు..

_ సిబ్బంది అందరికీ పాస్‌పోర్టుల పంపిణీ..

_ ప్రతిభ కనబరిచిన తొమ్మిది మందికి నగదు పురస్కారాలు..

_ జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్..

లోకల్ వైబ్స్, జీడిమెట్ల: ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ అన్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతంతో పాటు రాష్ట్ర గీతాన్ని సిబ్బందితో కలిసి ఆలపించారు. అనంతరం ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు భారీగా రావాలంటే శాంతిభద్రతలు అత్యుత్తమ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఎక్కువగా నమోదవుతున్న సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల (డ్రగ్స్) వాడకాన్ని అరికట్టేందుకు హోంగార్డు స్థాయి నుంచి ప్రతి అధికారీ అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది…
ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నగదు పురస్కారాలను అందజేస్తున్న సీఐ గడ్డం మల్లేష్..

ఆదర్శంగా …సిబ్బంది సంక్షేమం..

పోలీసుల సంక్షేమంలో జీడిమెట్ల పీఎస్ ఎప్పుడూ ముందుంటుందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగానే.. స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అందరికీ భారతీయ పాస్‌పోర్టుల (Indian Passport) కోసం దరఖాస్తు చేయించి, మంజూరైన పాస్‌పోర్టులను ఈ వేడుకల సందర్భంగా వారికి అందజేశారు. జీడిమెట్ల పోలీసులు ఎల్లప్పుడూ ఒక బృందంగా (టీమ్‌వర్క్) పనిచేస్తూ సమాజ సేవలో ముందుకెళ్తున్నారని ఆయన కితాబిచ్చారు. అనంతరం, ఈ ఏడాది విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తొమ్మిది మంది పోలీసులకు నగదు పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (డీఐ) ధనుంజయ్, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా సిబ్బంది, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేస్తున్న సిఐ గడ్డం మల్లేష్…
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments