HomeAPజీడిమెట్ల ఆర్టీసీ డిపోకు సమ్మె సెగ.. గేటు దాటని బస్సులు

జీడిమెట్ల ఆర్టీసీ డిపోకు సమ్మె సెగ.. గేటు దాటని బస్సులు

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా జీడిమెట్ల బస్ డిపో కార్మికులు సైతం సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.

సమ్మెలో పాల్గొన్న జీడిమెట్ల బస్ డిపో కార్మికులు

లోకల్ వైబ్స్, జీడిమెట్ల: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బంది చేపట్టిన సమ్మె ప్రభావంతో జీడిమెట్ల బస్ డిపో వద్ద కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డిపోకు చెందిన సిబ్బంది మూకుమ్మడిగా తమ విధులకు దూరంగా ఉంటూ, సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో బస్సుల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. జీడిమెట్ల డిపో పరిధిలో మొత్తం 138 బస్సులు సేవలందిస్తుండగా.. కార్మికుల ఆందోళనల కారణంగా ఏకంగా 135 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఇతర శాఖల సిబ్బంది, ప్రైవేటు వ్యక్తుల సాయంతో కేవలం మూడు బస్సులను మాత్రమే అధికారులు బయటకు నడపగలిగారు. ఇక్కడ విధులు నిర్వర్తించే మొత్తం 780 మంది సిబ్బందిలో.. ఏకంగా 769 మంది కార్మికులు పనులను పక్కనపెట్టి సమ్మెలో భాగస్వాములు అయ్యారు అని జేఏసీ నాయకులు తెలిపారు. తమ డిమాండ్ల సాధన కోసం, భవిష్యత్ ప్రణాళికల కోసం కార్మికులంతా ఏకగ్రీవంగా ఒక ఉమ్మడి కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్నారు కార్మికులు. కమిటీ ఛైర్మన్‌గా రాజు, ప్రధాన సలహాదారుడు గోవర్ధన్, సలహాదారులు ఎం. డానియేల్ రమేష్, కో కన్వీనర్ , కార్మికులు పాల్గొన్నారు.

కార్మికులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ జీడిమెట్ల బస్ డిపో ముందు నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు…
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments