HomeHOMEబంధం కుంట ఆక్రమణలకు తెరపడేనా..?

బంధం కుంట ఆక్రమణలకు తెరపడేనా..?

"వరద కాలువలు కబ్జా.. కాలనీల ముంపుకు కారణమవుతున్న అక్రమ నిర్మాణాలు: బాధితుల ఫిర్యాదుతో యాక్షన్‌లోకి సిఎంసి."

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

*– 15 ఎకరాలకు పైగా ఉన్న చెరువు ఇప్పుడు ఎంతుంది అనేది సమాధానం లేని ప్రశ్న…?*

*– చెరువుని దర్జాగా పూడ్చి షెడ్ల నిర్మాణం చేసిన ఓ నిర్మాణ సంస్థ*

*– తమ కాలనీ వరద నీటి కాలువను కబ్జా చేసి నిర్మాణం చేస్తున్నారని వోక్షిత్ హిల్ వ్యూ కాలనీవాసుల ఫిర్యాదు*

*– ఆక్రమణలపై ఫిర్యాదుల రూపంలో దృష్టికి తీసుకువచ్చిన లేని కనీస స్పందన*

*– పట్టని అధికార యంత్రాంగం*

*– మరోపక్క చెరువు శిఖం భూమిలో దర్జాగా వ్యాపార కార్యకలాపాలు*

*– క్రమక్రమంగా పెరుగుతున్న ఆక్రమణలు*

*– రోజురోజుకు ఉనికిని కోల్పోతున్న గాజులరామారం “బంధం కుంట” చెరువు*

*– ఎమ్మార్వో కార్యాలయంకి కూత వేటు దూరంలోనే చెరువులో కబ్జా*

*– సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి సృజన (ఐ ఎ ఎస్) పర్యటనతో ..*

*– మరో మరోసారి చర్చలోకి “బంధం కుంట” కబ్జాల వ్యవహారం*

లోకల్ వైబ్స్, గాజులరామారాం: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి సృజన (ఐ ఎ ఎస్) మంగళవారం కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం లో ఉన్న “బంధం కుంట” చెరువు పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమీపంలో ఉన్న వోక్షిత్ హిల్ వ్యూ కాలనీ వాసుల ఫిర్యాదు తో కమిషనర్ ఉన్నతాధికారుల బృందంతో పరిశీలించి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల తో సమన్వయం చేసుకొని చెరువు యొక్క హద్దులను గుర్తించాలని స్పష్టంగా సూచించారు. అయితే కమిషనర్ పర్యటనతో మరోసారి గాజులరామారం బంధం కుంట చెరువు కబ్జాల వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చినట్లయింది. ఇప్పటికే ఈ చెరువు కబ్జాల వ్యవహారంలో స్థానిక రెవిన్యూ అధికారులతో పాటుగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడక ముందు ఉన్న గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కూడా స్థానికులు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఆ ఫిర్యాదులపై స్పందన లేదు. ఒకసారి బంధం కుంట చెరువు ఆక్రమణల అంశాల పై వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తే…

సర్వే ఆఫ్ లేక్స్ నివేదికల ప్రకారం రూపొందించబడిన బంధం కుంట చెరువు కెడాష్డ్రాల్ మ్యాప్…

*రికార్డుల ప్రకారం…*

2016 డిసెంబర్ నెలలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు సర్వే ఆఫ్ లేక్స్ పేరిట బంధం కుంట చెరువును సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. దీని ప్రకారం చెరువు ఎఫ్ టి ఎల్ ప్రాంతంలో 15 ఎకరాల 20 గుంటల వరకు ఉన్నట్లుగా గుర్తించారు. దీనికి తొమ్మిది మీటర్ల బఫర్ జోన్ ప్రాంతం అదనంగా ఉంటుందని మార్క్ చేసినట్లుగా రికార్డును పరిశీలిస్తే అర్థమవుతుంది. చెరువు యొక్క ఎగువ ప్రాంతంలో ఇప్పటికే ఒక ప్రైవేట్ నిర్మాణ సంస్థ చెరువులో భారీగా నిర్మాణ వ్యర్థాలను వేసి పూడ్చివేసిందనే ఆరోపణలు ఉన్నాయి. చెరువు విస్తీర్ణంలో ప్రధానంగా సర్వేనెంబర్ 468, 449, 452, 450, 451 లతోపాటుగా పలు సర్వే నెంబర్లు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్నట్లుగా సర్వే ఆఫ్ లేక్స్ ప్రాజెక్టులో భాగంగా రూపొందించిన రికార్డులలో పేర్కొన్నారు. కడేస్టల్ మ్యాప్ ఆధారంగా సర్వేనెంబర్ 454, 452, 451, 448, 455 లలో ఉన్న ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో ఎస్ఎన్ఆర్ ఎస్ కే బి ప్రాజెక్ట్స్ వారు చెరువులో భారీగా మట్టిని డంప్ చేసి అక్కడ నిర్మాణాలు చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఇదే ప్రాంతానికి సమీపంలో మరొక వ్యక్తి చెరువులో ఒక షెడ్డు నిర్మించి అందులో పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. చెరువు ఎఫ్ టి ఎల్ బఫెలో ఎగువ ప్రాంతంలోని ప్రైవేటు నిర్మాణ సంస్థ తోపాటుగా మరో ముగ్గురు ఆక్రమణలు చేసి ఉన్నట్లుగా ఆరోపిస్తున్నారు.

సాటిలైట్ చిత్రాలలో స్పష్టంగా చెరువును పూడ్చినట్లుగా తెలుస్తుంది. (ఇన్సర్ట్ గురైన భాగం)

*సాటిలైట్ మ్యాప్స్ లో స్పష్టంగా..*

2025 లో కురిసిన భారీ వర్షాలతో “బంధం కుంట” ఎగువ ప్రాంతంలో ఉన్న రామన్ చెరువు, చింతలకుంట చెరువు ల నుంచి భారీగా వరద నీరు రావడంతో బంధం కుంట పూర్తిగా నిండిపోయింది. కాగా బంధం కుంట కు ఎగు ప్రాంతంలో ఆ సమయంలో కొన్ని నిర్మాణాలు రావడం నీరు కేవలం తూము ద్వారానే వెళ్లాల్సి ఉండటంతో వరద నీరు ప్రస్తుతం నిర్మాణం చేపడుతున్న ప్రైవేటు నిర్మాణ సంస్థ ప్రాజెక్టు భూమిని ముంచెత్తింది. అనంతరం వరద నీరు క్లియర్ అయిన తర్వాత సదరు నిర్మాణ సంస్థ వారి భూమిలో పనులు ప్రారంభించినప్పటికీ పక్కనే ఉన్న చెరువు ఎఫ్డీఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో దాదాపుగా రెండు వేల 500 గజాల చెరువు భూమిని మట్టితో నింపేసింది. ఈ విషయాన్ని గూగుల్ సాటిలైట్ మ్యాప్ లో స్పష్టంగా తెలుస్తుంది. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు, ప్రారంభం తర్వాత చెరువుని మట్టితో నింపిన వైనం ఇందులో చాలా క్లియర్ గా అర్థమవుతుంది.

*అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన..*

ఇక బంధన్ కుంట చెరువు ను మట్టితో పూడ్చుతున్నారు అన్న విషయంపై సంబంధిత అధికార యంత్రాంగానికి ఫిర్యాదు రూపంలో స్థానికులు తీసుకువెళ్లారు. ఆ ఫిర్యాదు పై అటు రెవెన్యూ అధికారులు కానీ ఇటు జిహెచ్ఎంసి అధికారులు కానీ ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతము కేవలం ప్రైవేటు నిర్మాణ సంస్థనే కాకుండా చెరువు చుట్టుపక్కల భారీగా అక్రమ కమర్షియల్ నిర్మాణాలు చేసేశారు అని, వీటిలో ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ ఇటీవల కాలంలోనే చోటుచేసుకున్నాయి అని, . ఈ అన్ని అక్రమ నిర్మాణానికి విద్యుత్ మీటర్లు రావడంతో చెరువుఎట్టిఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో అక్రమ వ్యాపార కార్యకలాపాలు నిర్వీర్యంగా కొనసాగుతున్నాయి అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

గాజులరామారం సర్వే నెంబర్ 468 ప్రభుత్వ భూమిలో (బంధం కుంట చెరువు భూమి) లో వెలసిన నిర్మాణాలు.

*ప్రధానంగా సర్వే నంబర్ 468 లో….*

15 ఎకరాల 20 గుంటల విస్తీర్ణంలో బంధం కుంట చెరువు ఉన్నట్లుగా నివేదికలు ఉన్నాయి. ఈ 15 ఎకరాల విస్తీర్ణంలో సింహభాగం సర్వేనెంబర్ 468 లో ఉన్న 12 ఎకరాల 20 గుంటలు చెరువు యొక్క శిఖం భూమిగా పేర్కొన్నారు. ఇటీవల అధికారులు రూపొందించిన నివేదికలలో కూడా సర్వేనెంబర్ 468 ప్రభుత్వ భూమిగా సికం భూమిగా అధికారులు తేల్చారు. ఇప్పుడు ఈ సర్వే నంబర్ 468 లోనే భారీగా అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిలో చిన్న టీ దుకాణం మొదలుకొని స్క్రాప్ దుకాణం, వాటర్ ప్లాంట్, బార్ అండ్ వైన్స్ రెస్టారెంట్, బ్రిక్స్ వర్క్స్, వాషింగ్ సెంటర్ ఇలా అన్ని రకాల వ్యాపారి కార్య కార్యకలాపాలు యదేచ్చగా కొనసాగుతున్నాయి అని దీనికి ఆధారం అధికారులు రూపొందించిన సర్వే మ్యాప్ అని స్పష్టం చేస్తున్నారు. రోడ్డుకి అవతలి వైపున ధోబి గాట్ కు స్థలం కేటాయించడం జరిగింది. దానికి అనుకొని ఓ వ్యక్తి ఈ మధ్యకాలంలోనే ఒక షెడ్డు నిర్మాణం చేసి వ్యాపారం చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న చెట్లను కూడా అడపాదడపా నరుక్కుంటూ వచ్చి ప్రస్తుతం ఏమి లేకుండా చేసే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతుంది.

*కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమి..

సర్వే నంబర్ 468 లో సింహభాగం ప్రాంతంలో ప్రస్తుతం చెరువు నీరు ఉన్నప్పటికీ రోడ్డుకి ఇవతల వైపు ఉన్న ప్రాంతంలో దాదాపుగా మూడు ఎకరాల విస్తీర్ణం ఆక్రమణకు గురైంది. ఎవరికివారు విశాలమైన దుకాణాలను ఏర్పాటు చేసుకొని కమర్షియల్ వ్యవహారాలు నడిపిస్తున్నారు. ప్రధాని రహదారిలో ఉన్న విలువైన ప్రభుత్వ భూమి, చెరువు ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్లను ఆక్రమించే వారి పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో బిజినెస్ చేస్తున్న వారికి ట్రేడ్ లైసెన్సులు ఉండటంతో పాటుగా టీజీఎస్పీడీసీఎల్ వారు జారీ చేసిన కరెంటు మీటర్లు కూడా కేటాయించారు అధికారులు. పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్లు, వ్యాపార కార్యకలాపాలు చెరువు ప్రభుత్వ భూమిలో నిర్వహిస్తున్న వారి పట్ల హైడ్రా కఠినంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. అదే రీతిలో కోట్లు విలువచేసే ఇక్కడే ప్రభుత్వ భూమి చెరువు ఎఫ్.టి.ఎల్ బఫర్ జోన్లను ఆక్రమించిన వారి పట్ల కూడా అదే వైఖరిన వ్యవహరించాలని కోరుతున్నారు స్థానికులు.

*సిఎంసి కమిషనర్ పర్యటనతోనైనా..

గతంలో ప్రైవేట్ నిర్మాణ సంస్థ చేపడుతున్న నిర్మాణ పనులపై జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు అధికార బృందంతో పరిశీలన చేశారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా మంగళవారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి సృజన (ఐ ఎ ఎస్) పర్యటనతో ఈసారైనా వోక్షిత్ హిల్ వ్యూ వరద నీటి సమస్య పరిష్కారంతోపాటుగా బంధం కుంట చెరువు ఆక్రమణ వ్యవహారంపై అధికారి యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నారు అక్కడివారు. ఈ పర్యట అంశాన్ని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన ఎక్స్ పోస్టులో ప్రస్తావించారు. సిఎంసి కమిషనర్ పర్యటనలో గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీపాద రామేశ్వర్, CCP వెంకన్న, అడిషనల్ CCP శైలజ, ఏసిపి సుమిత్ర, Dy EE (SWM)నిఖిల్ రెడ్డి, DY EE అనురాగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments