HomeCUREకాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై 'ముట్టడి'

కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ‘ముట్టడి’

అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ధరలు వెళ్లిన కొంపల్లి, దూలపల్లి బిజెపి నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

*– సైదాబాద్‌లో కొంపల్లి, దూలపల్లి డివిజన్ ల బీజేపీ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ అరెస్ట్*

లోకల్ వైబ్స్, కొంపల్లి: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఈ పోరాటంలో భాగంగా కొంపల్లి మున్సిపాలిటీకి చెందిన బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లి ప్రభుత్వ తీరుపై గళమెత్తారు.అసెంబ్లీ ముట్టడికి యత్నం.. పోలీసుల అదుపులో నాయకులుకొంపల్లి బీజేపీ పట్టణ అధ్యక్షుడు పెద్దబుద్దుల సతీష్ సాగర్ నాయకత్వంలో బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి దూసుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీగా నినాదాలు చేస్తూ అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో, పోలీసులు సతీష్ సాగర్‌తో పాటు ఇతర ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి సైదాబాద్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు.

అసెంబ్లీ ముట్టడి కి తరలి వెళ్లిన కొంపల్లి-దూలపల్లి డివిజన్ ల బీజేపీ పార్టీ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ , ఇతర నాయకులను అరెస్టు చేసి తరలిస్తున్న దృశ్యం..

ప్రజాధనం వృధా చేస్తున్నారు:

సతీష్ సాగర్ఈ సందర్భంగా సతీష్ సాగర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.బూటకపు హామీలతో ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అసాధ్యమైన హామీలతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని మండిపడ్డారు. ప్రక్షాళన, గాంధీ సరోవరం వంటి ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని, పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

అణచివేతలతో ఆపలేరు

అక్రమ అరెస్టులతో బీజేపీ పోరాటాలను ఆపలేరని, ప్రజల పక్షాన తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి సరితరావు, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కో-కన్వీనర్ శివాజీ రాజుతో పాటు జిల్లా నాయకులు శంకర్ నాయక్, అశోక్ పాల్గొన్నారు. అలాగే కొంపల్లి పట్టణ నాయకులు నరసింహ, దుర్గా, మహేందర్ సాగర్, శేఖర్ తదితరులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments