HomeCUREకల్మాన (యూఎంసీసీ) కుంట సమగ్ర అభివృద్ధికి చర్యలు

కల్మాన (యూఎంసీసీ) కుంట సమగ్ర అభివృద్ధికి చర్యలు

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

గాజుల రామారం సర్కిల్ యూఎంసీసీ ఉషా ముళ్ళపూడి హాస్పిటల్ (UMCC) కల్మాన కుంట, దాని పరిసర ప్రాంతాల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించేందుకు జోనల్ కమిషనర్, జలమండలి (HMWS&SB) ఉన్నతాధికారులతో కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.

_ కల్మాన (యూఎంసీసీ) కుంట సమగ్ర అభివృద్ధికి చర్యలు..

_ చెరువులోకి మురుగునీరు చేరకుండా అడ్డుకట్ట..

_ కట్ట పటిష్టానికి ప్రాధాన్యం..

_ జలమండలి ఉన్నతాధికారులతో కలిసి జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ సంయుక్త తనిఖీ..

లోకల్ వైబ్స్, కుత్బుల్లాపూర్: గాజుల రామారం సర్కిల్ యూఎంసీసీ ఉషా ముళ్ళపూడి హాస్పిటల్ (UMCC) కల్మాన కుంట, దాని పరిసర ప్రాంతాల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించేందుకు జోనల్ కమిషనర్, జలమండలి (HMWS&SB) ఉన్నతాధికారులతో కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి వనరుల సంరక్షణ, కుంట సమగ్ర అభివృద్ధి కార్యక్రమాల అమలుపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా చెరువు కట్టలను మరింత బలోపేతం (పటిష్టం) చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కుంటలోకి ఎలాంటి మురుగునీరు (సీవరేజ్) వచ్చి చేరకుండా శాశ్వత ప్రాతిపదికన పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. చెరువును ప్రక్షాళన చేసి, పరిసరాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

గాజులరామారం ఉషా ముల్లపూడి హాస్పిటల్ ఎదురుగా ఉన్న కల్మానకుంట చెరువు అభివృద్ధి పనుల పై వివరాలు తెలుసుకుంటున్న జోనల్ కమిషనర్ష్ పింకేష్ కుమార్.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments