HomeCUREపది ఫలితాల్లో 'శ్రీనిధి గ్లోబల్ స్కూల్' విద్యార్థుల సత్తా

పది ఫలితాల్లో ‘శ్రీనిధి గ్లోబల్ స్కూల్’ విద్యార్థుల సత్తా

Date: Posted By : LOCAL VIBES

Copyright © 2026 LOCAL VIBES. All rights reserved.

2025-2026 ఎస్సెస్సీ (పదవ తరగతి) పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో చింతల్ పరిధిలోని పద్మనగర్ ఫేజ్-2లో ఉన్న ‘శ్రీనిధి గ్లోబల్ స్కూల్’ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.

_ స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థిని వైష్ణవి

లోకల్ వైబ్స్, చింతల్: ఇటీవల విడుదలైన 2025-2026 ఎస్సెస్సీ (పదవ తరగతి) పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో చింతల్ పరిధిలోని పద్మనగర్ ఫేజ్-2లో ఉన్న ‘శ్రీనిధి గ్లోబల్ స్కూల్’ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ ఫలితాల్లో పాఠశాలకు చెందిన వెన్నం వైష్ణవి 600 మార్కులకు గాను 579 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. అలాగే పెండ్యాల దీక్షిత (573/600), సాహిరాజు శ్రేష్ట శ్రీ (573/600), తంగుడు వేదశ్రీ (570/600), శృతి గజానన్ మోరే (568/600), నందూరి వల్లి శివాని (561/600), దేవకి భువన వాసవి (554/600) అత్యుత్తమ మార్కులు సాధించి సత్తా చాటారు.

స్కూల్ టాపర్ వెన్నం వైష్ణవి కి శుభాకాంక్షలు తెలుపుతున్న అధ్యాపకులు..

విద్యార్థులకు యాజమాన్యం అభినందనలు

అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ నల్లపాటి రాజేశ్వరి, డైరెక్టర్ నల్లపాటి వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ కోమలి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రణాళికాబద్ధమైన బోధన, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని వారు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించి, ఎన్నో విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

పాఠశాల సెకండ్ ర్యాంకర్ విద్యార్థిని శ్రేష్ట్రా ను అభినందిస్తున్న పాఠశాల అధ్యాపకులు..
స్కూల్ సెకండ్ ర్యాంకర్ విద్యార్థిని దీక్షితను అభినందిస్తున్న పాఠశాల అధ్యాపకులు..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments